Hyderabad district news

రాష్ట్రంలో మరో ఎనిమిది భరోసా కేంద్రాల ప్రారంభం.
.        హైదరాబాద్( టైం టుడే) : రాష్ట్రంలో మరో 8 భరోసా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూలు, పెద్దపల్లి, వనపర్తి జిల్లాల్లోని కేంద్రాలను బిజెపి రవి గుప్తా, మహిళా భద్రత విభాగం అదనపు డీజీపీ  శిఖా గోయల్ మంగళవారం వర్చువల్ గా ప్రారంభించారు. అలాగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టిఎస్ఎఫ్ఎస్ఎల్ వెబ్సైట్ను ప్రారంభించారు .ఈ సందర్భంగా డిజిపి రవి గుప్తా మాట్లాడుతూ.. సీఎం ఎస్ ప్లాట్ఫామ్ ఫీచర్ తో కూడిన కొత్త  వెబ్ సైట్ ఫోరెన్సిక్  కార్యకలాపాలను మరింత మెరుగుపరిచేందుకు దోహదం చేస్తుందన్నారు. దర్యాప్తు సంస్థలు, ఎస్ ఎస్ ఎల్ కలిసి ప్రజలకు న్యాయం చేకూర్చడంలో  ప్రభావ వంతమైన పనితీరు కనబరుస్తాయని పేర్కొన్నారు. Iషికాగోయల్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు మహిళా బాధితులకు సాంత్వన చేకూర్చే ఉద్దేశంతో భరోసా కేంద్రాల ఏర్పాటు జరుగుతోందన్నారు. ఇవి ఇప్పటివరకు 4782 పోక్సో కేసులతో పాటు 1163 అత్యాచార కేసుల బాధితురాళ్లకు చేయూతనందించాయన్నారు. కార్యక్రమంలో అదనపు డీజీపీ  మహేష్ భగవత్, ఐజి తరుణ్ జోషి, డిఐజి రెమ్మా రామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.