ఉద్యమకారుడికి తెలంగాణ రాష్ట్రంలో చోటు లేదా బొమ్మెర రామ్మూర్తి.
ఉద్యమకారుడికి తెలంగాణ రాష్ట్రంలో చోటు లేదా బొమ్మెర రామ్మూర్తి.
ఎర్రుపాలెం (టైమ్‌టుడే): ఎర్రుపాలెం మండలంలో విలేకరుల సమావేశంలో మధిర నియోజకవర్గ బిఆర్ఎస్ రెబల్ అభ్యర్థి బొమ్మెర రామ్మూర్తి మాట్లాడుతూ 14 సంవత్సరములు తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేసి, 2010 నుండి 2017 వరకు ఇన్చార్జిగా పనిచేసి 70 గ్రామాలలో బిఆర్ఎస్ జండాను కట్టిన నేను జై తెలంగాణ అనే నినాదంతో ముందుకు నడిచిన వ్యక్తిగా నేనున్నానని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాడని, ఉద్యమంలో నడిచిన నాకు నాకు న్యాయం చేయలేదు? నేను చంచలుగూడా జైలుకు కూడా వెళ్లానని, ఉద్యమం కోసం ఎన్నో పోరాటాలు చేసిన నన్ను ఎందుకు నాకు అవకాశాన్ని ఇవ్వలేదు? తెలంగాణ పోరాటయోధుడిగా ఉన్న నన్ను తెలంగాణ రాష్ట్రం ఎందుకు గుర్తించడం లేదు? మధిర నియోజకవర్గ ప్రజానీకం ఎప్పుడూ నన్ను ఆదరిస్తారని ఆయన అన్నారు. ఒక ఉద్యమకారుడిగా నేను చేసిన తప్పేంటి? సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది నవంబర్ 4వ తేదీన టిఆర్ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసి తప్పకుండా గెలిచి తీరుతానని ఆయన తెలిపారు. నాటినుండి ఉద్యమం చేసి, పోరాటాలు చేసి, ఎన్నో కేసుల్లో ఉండి, జైలు జీవితాలు గడిపిన క్షణాలు చాలా ఉన్నాయి. నేను ప్రజల మనిషిని, ప్రజల పక్షాన ఉండే మనిషిని నన్ను మధిర నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ కాపాడుకుంటూ రానున్న ఎన్నికల్లో నాకు అత్యధిక మెజార్టీని ఇచ్చి గెలిపిస్తారన్న నమ్మకం నాకు ఉంది. మధిరలో 100 పడకల ఆసుపత్రి రావడానికి మంత్రుల దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్లి ఎన్నో నివేదికలు నేను సమర్పించాను. ఆసుపత్రి కట్టడానికి నా హస్తం కూడా ఉందని గుర్తుంచుకో! మధిర ప్రజానీకానికి యుద్ధం చేసే నాయకుడు కావాలా ఎక్కడో ఉండే నాయకుడు కావాలా? మధుర ప్రజానీకానికి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మధిర నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే పోరాట యోధుడు కావాలి. మూడుసార్లు ఓడిన మళ్లీ ఆయనకే పట్టం కట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి నేను గెలిచి నా సత్తా ఏంటో చూపిస్తానని ఆయన వివరించారు.
