ఎన్నికల కోడ్ నియమ నిబంధనలు పాటించాలి
ఎన్నికల కోడ్ నియమ నిబంధనలు పాటించాలి
కాప్రా (టైమ్‌టుడే):తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నియమ నిబంధనలు ప్రతి ఒక్కరు విధిగా పాటించాలని నాచారం ఎస్ఐ వెంకటయ్య అన్నారు.నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ లో పోలీసు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలను నిర్వహించారు.ఏలాంటి డబ్బులు గానీ,మద్యం గాని తరలిస్తే ఎన్నికల కోడ్ నియమ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని విజ్ఞప్తి చేశారు.ఎన్నికల కోడ్ నియమ నిబంధనల ప్రక్రియ వల్ల వాహనదారులు పోలీస్ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
