ఉచిత పథకాలతో ప్రజలను అసమర్థులుగా మారుస్తున్న ప్రస్తుత పార్టీలు

ఉచిత పథకాలతో ప్రజలను అసమర్థులుగా మారుస్తున్న ప్రస్తుత పార్టీలు

ఉచిత పథకాలతో ప్రజలను అసమర్థులుగా మారుస్తున్న ప్రస్తుత పార్టీలు

ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తూ నెలకు 30వేల జీతం ఇస్తాం...పాట పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చర్ల వెంకట్ రెడ్డి

హైద్రాబాద్(టైమ్‌టుడే): ఉచిత పథకాలతో ప్రజలను అసమర్థులుగా చేస్తున్న ప్రస్తుత రాజకీయ పార్టీలకు ధీటుగా... ప్రతి ఒక్కరికీ పని కల్పించాలనే ఉద్దేశ్యంతో వినూత్నంగా ఓ రాజకీయ పార్టీ ఆవిర్భవింది. పాట పార్టీ పాట పని పైసా అనే పేరుతో నూతన పార్టీ ఆవిర్భవింది. ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తూ... నెలకు 30వేల జీతం ఇస్తామన్నారు. పాట పాడుతూ పని చేస్తూ... పైసలు సంపాదించుకోవాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ పార్టీని రెండు నెలల క్రితం స్థాపించినట్లు ఆట పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చర్ల వెంకట్ రెడ్డి గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలిపారు. రాష్ట్రంలో చాలా మంది నిరుద్యోగులు పని లేకుండా ఉన్నారని,అందరికీ పని ఉండాలని ధనిక, పేద తేడా లేకుండా అందరూ సమానంగా జీవించాలన్నారు. ఈ కొత్త పార్టీ పేద ప్రజల పార్టీ అని, ధనికులకు వ్యతిరేకమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 33 రకాల బిచ్చగాళ్ళు ఉన్నారని, వీరిని నిజాం నవాబు తయారు చేశారని ఆయన తెలిపారు. పేద ప్రజలకు లక్ష టాక్స్ పేరుతో ప్రతి ధనికుని దగ్గర లక్ష రూపాయలు టాక్స్ రూపంలో వసూలు చేసి అందరికీ సరిసమానంగా ఈ డబ్బును పంచుతామని తెలిపారు. కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్న తమ పార్టీని తెలంగాణ ప్రజలు అధరించాలని కోరారు.50 నుంచి 60 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను రానున్న ఎన్నికల్లో పాట పార్టీ నుంచి బరిలో నిలబెడుతామన్నారు. తమ పార్టీ నుండి సికింద్రాబాద్ నియోజకవర్గం అభ్యర్థిగా కె. శ్రీనివాస్, ఆలేరు నియోజకవర్గ అభ్యర్థిగా కందేటి రమాదేవిలు పోటీచేయనున్నట్లు ప్రకటించారు. మధ్య నిషేధంతో పాటు ప్రతి పేద మహిళలకు మాత్రమే ఆటోను,కారును ఫ్రీగా ఇస్తామన్నారు. ప్రతి ఊర్లో కలెక్టర్, ఎస్పీ, కోర్టు, జైలు నిర్మించనున్నట్లు మచ్చర్ల వెంకట్ రెడ్డి, పాట పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తెలియజేశారు.