కుల మతాల సామరస్యానికి ప్రతీకగా కాంగ్రేస్ -- కార్యకర్తలు ఆగం కావద్దు

కుల మతాల సామరస్యానికి ప్రతీకగా కాంగ్రేస్ -- కార్యకర్తలు ఆగం కావద్దు

కుల మతాల సామరస్యానికి ప్రతీకగా కాంగ్రేస్

--నేనూ వస్తున్న కార్యకర్తలు ఆగం కావద్దు

 నారాయణ రెడ్డి

జహీరాబాద్ టౌన్ (టైమ్‌టుడే): కాంగ్రేస్ పార్టీ కుల మతాలకు అతీతంగా, పేద ప్రజలకు అండగా ఉంటుందని కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపిపి చిరాగ్ పల్లి నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం నారాయణ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, రాజకీయాల్లో చాల మార్పు వచ్చిందని, కొందరి స్వార్థ రాజకీయ నాయకుల పోకడలతో ప్రజల్లో కొంత అభద్రతా భావం ఏర్పడిందని అన్నారు. ప్రజలకు ప్రేమతో పలకరించి మనోధైర్యాన్ని నింపే నాయకులు కరువయ్యారని అన్నారు. తన రాజకీయ అనుభవంలో ప్రజలు దేవుండ్లని, ప్రజల సంక్షేమాన్ని రాజకీయాలు బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. తాను 15 సంవత్సరాలు సర్పంచుగా, బ్లాక్ సభ్యునిగా, ఎంపిపిగా, కాంగ్రేస్ పార్టీలో ఎన్నో బాధ్యత గల పదవులు నిర్వహించానని అన్నారు. తన కుమారుడు ఉజ్వల్ రెడ్డి కాంగ్రేస్ పార్టీలో క్రియాశీల బాధ్యతలు నిర్వహిస్తున్నాడని, ఉజ్వల్ రెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా సామాజిక సేవలు అందిస్తున్నాడని అన్నారు. తనకు మాదిరి, ఉజ్వల్ కు ప్రజలు ప్రేమతో ఆదరించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో త్వరలో పాల్గొంటానని, కార్తకర్తలతో, అభిమానులతో కలిసి కాంగ్రేస్ గెలుపుకు కృషి చేస్తాన్నారు. జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా తప్పుడు నాయకుల వెంట పోవద్దని, కాంగ్రేస్ పార్టీ తరపున తన కుటుంభం ప్రజలకు తోడుగా ఉంటుందన్నారు.