భట్టి విక్రమార్క విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటి ప్రచారం.
భట్టి విక్రమార్క విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటి ప్రచారం.
ఎర్రుపాలెం (టైమ్‌టుడే): ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల గ్రామంలో మల్లు భట్టి విక్రమార్క విజయాన్ని కాంక్షిస్తూ గ్రామ అధ్యక్షుడు, యూత్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటి గడపను తాకుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ఇస్తున్నందుకు సంతోషపడి ఈనెల 30వ తేదీన జరగబోయే ఎన్నికలలో మల్లు బట్టి విక్రమార్క ను గెలిపించాలని ఓటర్లను ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాసరావు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండ్ల రత్నబాబు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
