విద్యుత్ డిమాండు పై ఉపముఖ్యమంత్రి బట్టి ఆరా
విద్యుత్ డిమాండు పై ఉపముఖ్యమంత్రి బట్టి ఆరా
ఆ శాఖ అధికారులతో సమీక్ష
. హైదరాబాదు (టైమ్ టుడే): రాష్ట్రంలో సొంతంగా ఉత్పత్తి అవుతున్న కరెంటు ఎంత, వినియోగం ఎన్ని యూనిట్లు అనే లెక్కలను సమగ్రంగా సమర్పించాలని ఉప ముఖ్యమంత్రి ,విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క విద్యుత్ సంస్థలను ఆదేశించారు.
'విద్యుత్ డిమాండుకు రెక్కలు' అనే శీర్షికతో మంగళవారం 'ఈనాడు'లో వచ్చిన కథనానికి ఆయన స్పందించి అధికారులతో సమీక్షించారు. సొంత విద్యుత్పత్తి ఎందుకు తగ్గుతుంది. బయట మార్కెట్లో ఎందుకు ఎక్కువగా కొంటున్నారనే అంశంపై వివరణ ఇవ్వాలని ట్రాన్స్కో డిస్కoల అధికారులను అడిగారు.దీనిపై అధికారులు నివేదిక రూపొందించి ఆయనకు అందజేశారు. మంగళవారం ఉదయం 7.51 గంటలకు అత్యధికంగా 14,146 మెగావాట్ల డిమాండ్ నమోదయింది. గత ఏడాది ఇదే రోజు (ఫిబ్రవరి 6న) 13,449 మెగావాట్ల డిమాండ్ ఉంది. ప్రస్తుతం వ్యవసాయ బోరులకు కరెంటు వినియోగం వల్ల.. ఉదయం 6 నుంచి 10 వరకు, తిరిగి సాయంత్రం 6 నుంచి 9 వరకు అత్యధిక వినియోగం నమోదవడంతో డిమాండ్ పెరుగుతోందని అధికారులు వివరించారు .
