అశ్వాపురం మణుగూరు లో ఆధార్ సెంటర్ లు పెంచాలి

జిల్లా అదనపు కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేసిన మణుగూరు మాజీ జడ్పిటిసి పాల్వంచ దుర్గ 

అశ్వాపురం మణుగూరు లో ఆధార్ సెంటర్ లు పెంచాలి

 మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలు ఆధార్ కార్డుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మణుగూరు మండల మాజీ జడ్పిటిసి పాల్వంచ దుర్గ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆమెకొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ ను కలిసి, మణుగూరు అశ్వాపురం మండలాల గిరిజన ప్రాంతాల ప్రజలు ఆధార్ సెంటర్ల సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అశ్వాపురంలో ఉన్న గిరిజన ప్రాంతాల ప్రజలు సుదూర ప్రాంతమైన మణుగూరుకు వచ్చి ఆధార్ అప్డేట్ చేయించుకుంటున్నారని, సమస్యను దృష్టిలో పెట్టుకొని రెండు మండలాల్లో సరిపడా ఆధార్ సెంటర్ లను ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. మండలాల్లో వృద్ధులు చిన్నపిల్లలు నానా అవస్థలు పడుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, సత్వరమే ఆధార్ సెంటర్ల ఏర్పాటు ప్రక్రియ దిశగా చర్యలు తీసుకోవాలని ఆమె అదనపు కలెక్టర్ రాంబాబును కోరారు.