తెలంగాణ చీఫ్ ఎలెక్ట్రోల్ ఆఫీసర్ కి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ లేఖ.
తెలంగాణ చీఫ్ ఎలెక్ట్రోల్ ఆఫీసర్ కి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ లేఖ.
హైద్రాబాద్(టైమ్‌టుడే): తెలంగాణ చీఫ్ ఎలెక్ట్రోల్ ఆఫీసర్ కి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ లేఖ వ్రాసింది.ఈమేరకు గురువారం హైద్రాబాద్ లో మీడియాతో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ మాట్లాడుతూ...తెలంగాణ లో 3 వ తేది నుండి జరుగుతున్న నామినేషన్లకు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులకు ఓటు ధ్రువీకరణ సర్టిఫికేట్ ను 119 నియోజకవర్గాలలో వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.రాష్ట్రంలో ఎక్కడైనా ఎలెక్ట్రోల్ ఆఫీసర్ ఎమ్మార్వో లు నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని. జిల్లా కలెక్టర్లు ఎన్నికల నియమావళి 1959 Act 29A ని సంపూర్ణంగా అమలు చేసి నామినేషన్లు వేయు వారికి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి బలపరిచే అభ్యర్ధులను, పోటీ పరిచే వారికి ఓటు హక్కు పరిశీలించి అభ్యర్థుల అఫిడివిట్ తో పాటు నామినేషన్ వేయు అభ్యర్థికి తూచ తప్పకుండ నామినేషన్ సక్రమంగా జరిగే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ నెల 30వ తేదీన జరిగే తెలంగాణ ఎన్నికలో వెంటనే కౌంటింగ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ ద్వారా నామినేషన్లు వేయటానికి వెసులుబాటు చేయాలని,ఈ నెల 3 వ తేదీ నుండి డిసెంబర్ 1 వరకు మద్యపానం నిషేదించాలని కోరారు. ప్రతి ఒకరు ఓటు హక్కు వినుయోగదించుకొని ఈ ఎన్నికలో నూటికి నూరు శాతం పోలింగ్ జరగాలని మా నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుందని అన్నారు.హైదరాబాద్ పాత బస్తి లో మా నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రచారం చేసుకున్నప్పుడు ప్రత్యేక రక్షణ కలిపించాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి,ఎన్నికలు ప్రశాంతంగా జరిగేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం, తెలంగాణ డిజిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
