మద్యం దుకాణాలను ఆకస్మిక తనిఖీ.
మద్యం దుకాణాలను ఆకస్మిక తనిఖీ.
ఎర్రుపాలెం (టైమ్టుడే): తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, ఖమ్మం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి, జి. నాగేంద్ర రెడ్డి ఎర్రుపాలెం మండలం లోని మీనవోలులో కల గెజిట్ సీరియల్ నెంబర్ 82, మంజీర మద్యం షాపు లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మద్యం షాపులలో మద్యం అమ్మకాలు లైసెన్స్ రూల్స్ ప్రకారం చేయాలని తెలిపారు లేనిచో కఠిన చర్యలు తీసుకొనగలమని తెలిపారు అదే విధంగా తెలంగాణా మరియు ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లోని ఎర్రుపాలెం మండల పరిధిలో గల రాజుపాలెం సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద మరియు బోనకల్ మండల సరిహద్దు చెక్ పోస్టులలో తనిఖీ నిర్వహించారు. అదే విధంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్రమ మద్యం అమ్మకాలు,నల్ల బెల్లం, పటిక, గంజాయి రవాణా సంబంధిత ఎక్సైజ్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా మధిర ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎం ప్రసాద్ కు తగు సూచనలు చేశారు. ఈ తనిఖీలలో ఎస్ ఐ సురేష్, సబ్ ఇన్స్పెక్టర్లు చంద్రశేఖర్, శార్వాణీ, సిబ్బంది సిహెచ్ గోపి, షేక్ రియాజ్, షేక్ ముస్తఫా పాల్గొన్నారు.
