బచ్చోడు వాసి కి గౌరవ డాక్టరేట్
బచ్చోడు వాసి కి గౌరవ డాక్టరేట్
తిరుమలయపాలెం(టైమ్టుడే) కష్టాలను. కడగండ్లను ఎదుర్కొంటూ తమ కష్టాన్ని జీవనాధారం చేసుకొని గ్రామంలో రైతుల దగ్గర. వ్యవసాయ కార్మికుల దగ్గర దళిత బైండ్ల కులవృత్తి అయిన జముడికా భుజా నా వేసుకొని బిక్షేటన చేస్తూ. ఇతర జిల్లాలకు వలసలు వెళ్లి తమ కుమారులను ఉన్నతమైన చదువులకై ఎన్నో కష్టాలు పడ్డ తిమ్మిడి వెంకన్న. సుభద్రాల కుమారులైన డాక్టర్ తిమ్మిడి నాగరాజు. తిమ్మిడి రవి. తిమ్మిడి మహేష్. తిమ్మిడి సైదులను ఉన్నతమైన చదువులకై తమ జీవితం దారపోశారని తల్లిదండ్రుల కష్టానికి తగ్గ ఫలితాన్ని కొడుకులు ఇచ్చినందుకు.సంతోషానికి తల్లిదండ్రులు ఎంతో గర్వపడుతున్నారని. స్థానిక జిల్లా తిరుమలాయపాలెం మండలం. బచ్చోడు గ్రామానికి చెందిన డాక్టర్ తిమ్మిడి నాగరాజు ఈరోజు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్యం రాజన్ చేతుల మీదుగా ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో తెలంగాణ దళిత మహిళ సాధికారత అనే అంశంపై ( పి హెచ్ డి)డాక్టరేట్ పట్టా పొందిన సందర్భంగా డాక్టర్ తిమ్మిడి నాగరాజుని ప్రముఖులు ఆశీర్వదించ అభినందనలు తెలిపారని డాక్టర్ తిమ్మిడి నాగరాజు పీహెచ్డీ డాక్టర్ పట్టా తోపాటు రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన డాక్టర్ తిమ్మిడి నాగరాజుని ప్రతి ఒక్కరు ఉన్నతమైన సదువులు చది విడి వారి ఇంట్లో చదువుల పంట పండించాలని అభినందించారు. సిపిఐ ( ఎంఎల్ ప్రజాపం దా ) నాయకుడు అయిన వారి బాబాయ్ హనుమంతరావు. సైదమ్మల సహకారంతో విద్యని కొనసాగించి పి డి ఎస్ యు ఉద్యమంలో చేరి శాస్త్రీయ విద్యాసాధన కోసం ప్రగతిశీల భావాలతోటి జార్జి రెడ్డి. జంపాల ప్రసాద్. శ్రీపాద శ్రీహరి ఆశయాల బాటలో ప్రయాణం చేస్తూ ఈ దేశంలో విద్యపై జరుగుతున్న దోపిడీ అన్యాయాలపై అధ్యయనం చేస్తూనే వారి చదువులపై శ్రద్ధతో పై స్థానాలకు ఎదిగినటువంటి డాక్టర్ తిమ్మిడి నాగరాజు ఈరోజు ఆదర్శంగా నిలిచాడని అన్నయ్య బాటలోనే ఎంబీఏ పూర్తి చేసిన రెండవ కుమారుడు తిమ్మిడి రవి ప్రస్తుతం డాక్టరుగా పనిచేస్తూ జీవనం గడుపుతున్నాడని. మూడవ కుమారుడు తిమ్మిడి మహేష్ బాబు లాయర్ పట్టా పొందినాడని. చిన్న కుమారుడు తిమ్మిడి సైదులు ఐడిబిఐ బ్యాంకులో ప్రభుత్వ ఉద్యోగం పొంది అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని మీరు బాటలోనే తిమ్మిడి హనుమంతరావు సైదమ్మల కుమారుడు తిమ్మిడి మురళీకృష్ణ హైకోర్టు అడ్వకేట్ (లాయర్) గా. కుమార్తె తిమ్మిడి స్పందన కాకతీయ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసి ఉన్నతమైన సాధువులకి వారు ప్రయత్నాలు గ్రామ ప్రజలను ఆకర్షిస్తున్నాయని. బచ్చోడు గ్రామంలోని ఎలాంటి భూమి లేని నిరుపేద దళిత బండ్ల కుటుంబం లో నిరుపేదలైన ప్రతి ఒక్కరు చదువుకి విలువ ఇవ్వాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. జ్యోతిరావు పూలే. సావిత్రిబాయి పూలే ఆశయాలను అమలు చేయడం కోసం ప్రతి ఒక్కరూ కులం మతం లేకుండా ప్రాంతం భావం లేకుండా చదువుకై పోరాటాలని చదువుతూ ఆదర్శంగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందని. నేటి యువతరాన్ని ఈ ప్రభుత్వాలు మద్యం మత్తులో ఎందుకు పనికి రాకుండా యువతను చేస్తున్నారని అలాంటప్పుడు మనల కన్న తల్లిదండ్రుల కలలో సాకారం చేయాలంటే ప్రతి ఒక్కరం శ్రద్ధతో ఉన్నతమైన చదువులు చదివి మన గ్రామానికి. మండలానికి. జిల్లాకి. రాష్ట్రానికి. దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని. ఈ సమాజంలో మంచి గౌరవాన్ని సాధించినప్పుడే వారి ఆ కలలు నిజమవుతాయని అభిప్రాయపడ్డారు.. ఠాగూర్ ఆడిటోరియంలో డాక్టరేట్ పట్టా పొందిన సందర్భంగా డాక్టర్ తిమ్మిడి నాగరాజు కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా తన కొడుకు ఉన్నతమైన సదువులు సది వి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మాకింత గౌరవాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అని డాక్టర్ తిమ్మిడినాగరాజు అన్నారు తల్లిదండ్రులు. బాబాయిలు. అన్నయ్యలు. తమ్ముళ్లు. చెల్లెలు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తిమ్మిడి వెంకన్న. తిమ్మిడి సుభద్ర. తిమ్మిడి హనుమంతరావు. తిమ్మిడి మహేష్. అడ్వకేట్. తిమ్మిడి రజిత. తిమ్మిడి మురళీకృష్ణ అడ్వకేట్. తిమ్మిడి సైదులు ప్రభుత్వ ఉద్యోగి. తిమ్మిడి స్పందన. తిమ్మిడి రఘుబాబు. తిమ్మిడి త్రివేదు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
TIMETODAY-ADMIN
