మానవ హక్కుల కౌన్సిల్ జిల్లా అధ్యక్షురాలుగా కొత్తపల్లి సరిత
మానవ హక్కుల కౌన్సిల్ జిల్లా అధ్యక్షురాలుగా కొత్తపల్లి సరిత

తిరుమలాయపాలెo (టైమ్‌టుడే)
జాతీయ మానవ హక్కుల కౌన్సిల్. (ఎన్.హెచ్.ఆర్.ఎస్) ఖమ్మం జిల్లా అధ్యక్షురాలిగా తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కొత్తపల్లి సరితను శనివారం హైదరాబాద్ లోని జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ కార్యాలయంలో.జాతీయ మానవ హక్కుల చైర్మన్ సంపత్ కుమార్ జనరల్ సెక్రెటరీ బి అరుణ్ కుమార్. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏం రవికుమార్ చేతుల మీదుగా కొత్తపల్లి సరిత కు నియామక పత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా బి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఎంతో రాజకీయ అనుభవం కలిగిన కొత్తపల్లి సరిత పలు రాజకీయ పార్టీలలో కీలకమైన భాద్యత నిర్వహించి ప్రజాసేవలో ప్రజలతో మమేకమైన మంచి గుర్తింపు ఉన్న సరిత జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ లో భాగస్వామ్యం అవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నా మీద ఎంతో నమ్మకంతో ఖమ్మం జిల్లా మానవ హక్కుల కౌన్సిల్ అధ్యక్షురాలుగా ఎంపిక చేసినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.
ఖమ్మం జిల్లాలో మానవ హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా తన వంతు కృషి వస్తానని ఆమె తెలిపారు. త్వరలో ఖమ్మం జిల్లా ఎన్ హెచ్ ఆర్ సి కమిటీ సభ్యుల నియామకం జరుగుతుందని సరిత తెలిపారు. మానవ హక్కుల కౌన్సిల్ ఖమ్మం జిల్లా అధ్యక్షురాలుగా ఎంపికైనందుకు వివిధ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు.
